- పేద ప్రజల సంక్షేమమే కేంద్రం లక్ష్యం
- బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు చిరంజీవి
వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని దండేపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రభుత్వ అధికారులతో కలిసి నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడితాడి చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోడీ పాలన సాగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించారు.