వేద న్యూస్, డెస్క్ :
రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు.
తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్షా ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా, ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాల మయమని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ మూడు వారసత్వ పార్టీలేనని దుయ్యబట్టారు. మోదీని మూడోసారి ప్రధానిగా చేద్దామని, మోదీ 400 లక్ష్యం దాటలంటే తెలంగాణ నుంచి 12కి పైగా ఎంపీ స్థానాలు రావాల్సి ఉందని అన్నారు.అవినీతిరహిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా, మోదీ పదేళ్లుగా సుస్థిర పరిపాలన అందించారని కొనియాడారు.