వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి:
కొత్తకొండలో కొలువైన వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవిని రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని రామలింగేశ్వర క్షేత్ర ఫౌండరీ చైర్మన్ తటాకం నాగలింగం శర్మ, రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఉప ప్రధానార్చకులు రాచెడు రవిశర్మ, అర్చకులు ప్రసాద్, శ్రీనివాస్ శర్మ, అర్చక ఫౌండరీ చైర్మన్ నాగలింగం తదితరులు దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా కొత్తకొండ కొత్తకొండ దేవాలయ అర్చకులు దేవస్థానం తరఫున శేష వస్త్రము, ప్రసాదాల వితరణ అందజేసి..వేదమంత్రాలతో ఆశీర్వదించారు. కోరిన కోరికలు నెరవేర్చే కోరమీసాల దేవుడు వీరభద్రస్వామి అని ఈ సందర్భంగా భక్తులు, అర్చకులు తెలిపారు.