వేద న్యూస్, వరంగల్ టౌన్: 

వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ సభ్యులు తెలిపారు.బుధవారం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి101ఏ, హరిప్రియా పీడ్స్ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం ప్రారంభోత్సవానికి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ విడియాల నూతన్ కుమార్, గుండా అమర్ నాథ్, వేములపల్లి సునిల్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలివేంద్రంరైల్వే ప్రయాణికుల దాహం తీర్చుకోవడానికి ఎంతగానో దోహదం పడుతుందని తెలిపారు.వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి తాము ఏర్పాటు చేసిన చలివేంద్రంలో చల్లని 80 లీటర్ల సామర్ద్యం కలిగిన ఆర్వో వాటర్ అందు బాటులో ఉంటుందని, ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ చలివేంద్రం ప్రజలకు సేవలను అందిస్తుందని నిర్వాహకులు వేములపల్లి సునిల్ తెలిపారు.