వేద న్యూస్, వరంగల్:
స్వేరోస్ నెట్ వర్క్ రాష్ట్ర అధ్యక్షులు చిలక బత్తిని వీరన్న ఆదేశాల మేరకు స్వేరోస్ వరంగల్ జిల్లా కమిటీని ఏర్పాటు చేసినట్లు నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వేరోస్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కత్తి చందును నియమించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ రిసార్ట్ పర్సన్ చింత సదానందం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారమల్ల ప్రకాష్, రాష్ట్ర ఈసీ నెంబర్ మారేపల్లి మనోజ్, రాష్ట్రఉపాధ్యక్షులు అమ్మఒడి శ్యామల తదితరులు పాల్గొన్నట్లు స్పష్టం చేశారు.