వేద న్యూస్, ఇబ్రహీంపట్నం:

ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో స్థానిక ఎలక్షన్ సందర్బంగా వర్షకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామపంచాయతీ సర్పంచ్ గా పొనకంటి చిన్న వేంకట్ నామినేషన్ వేశారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వర్షకొండ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పాడుతూ నిరంతరం ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారనికి కృషి చేస్తానని తెలియజేసారు.

ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తానని వెంకట్, పేర్కొన్నారు.పెన్షన్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన నిరుపేదలకు అందేలా పోరాడుతానని చెప్పారు.

వర్షకొండ గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ద్వేయంతో సర్పంచ్ పదవికికి పోటి చేస్తున్న అని తెలిపారు. గ్రామ అభివృద్ధి సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం ఇవే తన ప్రాధాన్యతలు అని పేర్కొన్నారు.

గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతానని, గ్రామ ప్రజలను ఆశీర్వాదం కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.