- వరద ముప్పు నుంచి కాపాడినందుకు ప్రజల హర్షం
- ర్యాలీలు నిర్వహించి హైడ్రా ఆఫీసర్లకు జనం అభినందనలు
వేద న్యూస్, హైదరాబాద్, ప్రతినిధి:
హైదరాబాద్ నగరంలోని అనే కాలనీవాసులు హైడ్రాకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ప్రజల నుంచి స్వతంత్ర ఏజెన్సీకి కృతజ్ఞతల వెల్లువ కొనసాగుతోంది. నగరంలో వరద ముప్పు నుంచి అనేక కాలనీలను తప్పించిన హైడ్రా వ్యవస్థకు జనం జేజేలు పలుకుతున్నారు.
హైడ్రా ఎంటరయితే సమస్యలు సాల్వ్
అమీర్‌పేట, శ్రీనివాస్‌నగర్, గాయత్రీనగర్, కృష్ణనగర్, అంబేద్కర్‌నగర్ ప్రాంతాల నివాసితులు ర్యాలీలు నిర్వహించి హైడ్రా అధికారులకు అభినందనలు తెలిపారు.
మైత్రివనం వద్ద ప్లకార్డులు ప్రదర్శించి, వరదలతో అతలాకుతలమైన తమ కాలనీలను రక్షించినందుకు హైడ్రాను కొనియాడారు. అంటే 5 సెంటీమీటర్ల వర్షం పడ్డా నీట మునిగిపోయే అమీర్‌పేట ప్రాంతం, ఇప్పుడు 15 సెంటీమీటర్ల భారీ వర్షానికి కూడా నీరు నిలవకుండా మారిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
భూగర్భ పైపులైన్లలో పేరుకున్న పూడికను హైడ్రా పూర్తిగా తొలగించడంతో సమస్య సర్వం సిధ్ధైందని తెలిపారు. అంబేద్కర్‌నగర్‌లో డ్రైనేజీ రోడ్లపై పారే సమస్య కూడా హైడ్రా జోక్యంతో పరిష్కారమైందని నివాసితులు పేర్కొన్నారు.
నాలా వెడల్పుకు ‘హైడ్రా’ యాక్షన్
హైడ్రా వ్యవస్థ ప్రవేశపెట్టడంలో, సమస్య పరిష్కారంపై పర్యవేక్షణలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రజలు అభినందించారు.
హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ పలు మార్లు పరిశీలించి చర్యలు తీసుకోవడం వల్లే ఈ ఫలితం సాధ్యమైందని వారు అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంటే, ప్యాట్నీ నాలా విస్తరణతో ఏడెనిమిది పైకాలనీలకు వరద ముప్పు తొలగింది. పాయిగా కాలనీ, ప్యాట్నీ కాలనీ, విమాననగర్, బీహెచ్ఈఎల్ కాలనీ, ఇందిరమ్మనగర్ తదితర ప్రాంతాల ప్రజలు ర్యాలీగా వచ్చి కృతజ్ఞతలు తెలిపారు.
ప్యాట్నీ వద్ద 70 అడుగుల నాలా 15–18 అడుగులకు కుంచించుకుపోవడంతో దశాబ్దాల సమస్య తలెత్తిందని, హైడ్రా చర్యలతో మళ్లీ అసలు వెడల్పుకు విస్తరించడంతో సమస్య శాశ్వత పరిష్కారమైందని పేర్కొన్నారు.
30 ఏళ్లుగా వర్షం పడితే వాహనాలు, ఇళ్ల సామాన్లు మునిగిపోయి భారీ నష్టాలు వచ్చేవని నివాసితులు గుర్తు చేసుకున్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే హైడ్రా స్పందించి పరిష్కారం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు

