వేద న్యూస్, కోదాడ టౌన్ :
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా కోదాడ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఓరుగంటి ప్రభాకర్ సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ సంయుక్త ఆధ్వర్యంలో ఆశ్రమంలో ఉన్న అనాధలకు వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిమాన నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఇలా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అబివృద్ధి సంక్షేమం ఉద్యోగ ఉపాధి అవకాశాల తో పాటు సామాజిక సేవలో ముందు ఉన్నారని. ఇప్పటికే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారానే ఎంతో మంది పిల్లలకు ఉచిత విద్య వైద్యం అందిస్తున్నారని తెలిపారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు అని అన్నారు. రాజకీయాలు అంటే అదికార దర్పం కోసం కాకుండా సామాజిక సేవలో ముందున్నారని వారిని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. భవిష్యత్ లో తెలుగు దేశం పార్టీ తెలంగాణలో క్రియాశీలక పాత్ర పోషించే సమయం ఆసన్నమైందని ప్రజలకు సుపరిపాలన తెలుగు దేశంతోనే సాధ్యమని అన్నారు.క్రమశిక్షణకు మారు పేరు తెలుగు దేశం అని ఇతర పార్టీల లలో ఉన్న తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తిరిగి సొంత గూటికి రావాలని తెలంగాణకు ముఖ ద్వారమైన కోదాడ నుంచే పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాదెండ్ల గోపాల్ రావు,కొండ పావులూరి వెంకటేశ్వరరావు, అమరవరపు శ్రీమన్నారాయణ,బిజేపి నాయకులు జల్లా జనార్దన్ రావు,ఆశ్రమం నిర్వాహకులు నాగిరెడ్డి, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు అని అన్నారు.