వేద న్యూస్, మరిపెడ:
సీఎం కప్ 2024 మరిపెడ మండల స్థాయి జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ క్రీడా పోటీలు మరిపెడ ఉన్నత పాఠశాల లో మంగళవారం ప్రారంభం అయ్యాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు క్రీడా జ్యోతిని వెలిగించి గ్రౌండ్ అంతా కలియదిరుగుతూ క్రీడా స్ఫూర్తిని చాటారు. ఆ తర్వాత ముఖ్య అతిథి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ బి. కిరణ్ కుమార్ టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. వారితో పాటు ప్రత్యేక అతిథులు మరిపెడ మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ మూర్తి, ఎంపీడీవో విజయ కుమారి, ఎంఈఓ అనితాదేవి మరిపెడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు, పాఠశాల స్టాఫ్ సెక్రెటరీ రామ్మోహన్ బయగాని, మరిపెడ మండలం పిడి రాజకుమారి ఉన్నారు.

ఈ సీఎం కప్ 2024 రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 7 నుండి జనవరి 2 వరకు కొనసాగుతాయి. గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం కల్పించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు డిసెంబర్ 7 నుండి 8 గ్రామస్థాయిలో, డిసెంబర్ 10 నుండి 12 మండల స్థాయిలో, డిసెంబర్ 16 నుండి 21 జిల్లా స్థాయిలో వివిధ క్రీడలపై పోటీలు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా మరిపెడ మండలంలో మంగళవారం కబడ్డీ వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పీడీలు రామ, శ్రీనివాస్,రాంబాబు, స్వప్న, శ్రీకాంత్, రవి, రవీందర్, సుమన్, శ్రీహరి మొదలగువారు నిర్వహించారు. ఈ పోటీలలో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.