వేద న్యూస్, సూర్యాపేట ప్రత్యేక ప్రతినిధి :

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం తన నివాసంలో సీఎం సహాయ నిధి ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన 18 మంది లబ్దిదారులకు 7 లక్షల 81,000 రూపాయల సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సిఎం ఆర్ ఎఫ్ పధకం ద్వారా పేదల ఆరోగ్యానికి అత్యదిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వైద్యం, విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సూర్యాపేట నియోజకవర్గంలో 55 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు 24,70,500 సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను ఇచ్చిందని కానీ పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు.సిఎంఆర్ఎఫ్ పథకం అనారోగ్యంతో బాధపడుతున్న వారు చికిత్స కోసం తమను సంప్రదిస్తే ఈ పథకం ద్వారా సహాయం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.