వేద న్యూస్, వరంగల్:
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు జీడబ్ల్యూఎంసీ 29వ డివిజన్ కు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి పూర్ణ ఆధ్వర్యంలో డివిజన్ కాంగ్రెస్ కార్యాలయంలో డివిజన్ మాజీ కార్పొరేటర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుద్ధ జగన్ చేతుల మీదుగా రూ.1 లక్షా 80 వేల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డివిజన్ కు సంబంధించి మొత్తంగా 25 లక్షల కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించినట్టు పేర్కొన్నారు. మిగిలిన పెండింగ్ చెక్కులను కూడా ఎమ్మెల్యే విదేశీ పర్యటన అనంతరం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.