వేద న్యూస్, హన్మకొండ :

మొంథా తుపాను ప్రభావంతో  కుండపోతగా కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో  హన్మకొండ నయింనగర్ ప్రాంతంలో సీఎండీ  కర్నాటి వరుణ్ రెడ్డి  విద్యుత్ సరఫరాపరిస్థితులను, పునరుద్ధరణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. సందర్భంగా ఆయన ఫీల్డ్ ఇంజినీర్లు, సిబ్బందితో  నేరుగా మాట్లాడి ఫీడర్లు, సబ్‌స్టేషన్లస్థితిని సమీక్షించారు. వర్షాల కారణంగా ఎక్కడైనా విద్యుత్ అంతరాయం జరిగినపుడుతక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు నిరంతరఅప్రమత్తతతో పని చేయాలని సూచించారు. బ్రేక్ డౌన్  బృందాలు వర్షా ప్రభావిత ప్రాంతాల్లో రాత్రింబవళ్ళు పనిచేస్తూ, విద్యుత్ సరఫరానిరంతరంగా కొనసాగేందుకు కృషి చేస్తున్నాయని అన్నారు. ఎటువంటి విద్యుత్సమస్యలకైనా 1912 లో సంప్రదించాలని పేర్కొన్నారు.