వేదన్యూస్ -భద్రాచలం
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సతీమణితో కల్సి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రుళ్లకు పట్టువస్త్రాలతో పాటు తలంబ్రాలు అందజేశారు. అనంతరం అక్కడ జరిగిన వేడుకల్లో సీఎం పాల్గోన్నారు.

ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరావు తో కల్సి సన్నబియ్య లబ్ధిదారుడైన సారపాకకు చెందిన బూర ం శ్రీనివాస్ ఇంట్లో సహాపంక్తి భోజనం లో పాల్గోన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తులసమ్మతో మాట్లాడుతూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు సౌకర్యం.. ఐదోందలకు గ్యాస్ సిలిండర్, రెండోందల యూనిట్ వరకూ విద్యుత్ పథకాల గురించి ఆరా తీశారు.
