• రూ. 35 వేలు అందజేత

వేద న్యూస్,బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామానికి చెందిన ఎదురుగట్ల నాగరాజు, ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా, అక్కడ బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, రావడంతో స్వదేశానికి తీసుకువచ్చారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఆయన వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా ఆయన భార్య లావణ్య, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ను వేడుకుంది.

స్పందించిన జిల్లా కలెక్టర్ వైద్య చికిత్స నిమిత్తం రూ. 35 వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును నాగరాజు,భార్య లావణ్య, కు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అందజేశారు. తన భర్త వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించిన జిల్లా కలెక్టర్, కు లావణ్య, కృతజ్ఞతలు తెలిపింది.