- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యాలయంలో అకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
- ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదు: సందీప్ కుమార్
వేద న్యూస్, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యాలయాన్ని కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు . ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
మంగళవారం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని విభాగాలు, వార్డులను పరిశీలించి, సిబ్బంది హాజరు వివరాలు, రిజిస్టర్, ఫార్మసీ తదితర అంశాలపై ఆరా తీశారు.

ప్రతి రోజూ ఆసుపత్రికి వైద్యం కోసం ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవల తీరుపై ఆసుపత్రికి వచ్చిన రోగులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడారు.ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండాలని, సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అందుబాటులో లేని సిబ్బంది పట్ల తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో అందించే సేవలపై అవగాహన కల్పించాలని, ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు.
గ్యాస్ స్టవ్ పైనే మధ్యాహ్న భోజనం తయారుచేయాలన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తనిఖీలో కలెక్టర్.పెద్దలింగాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలకు వెళ్లిన కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు? అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
తరగతి గదులను సందర్శించి, ఎన్ని ఎల్ఈడీ ప్యానెల్స్ వివరాలను ఆరా తీశారు. తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌలపై మాత్రమే తయారు చేయాలని ఆదేశించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టీ బోధించాలని తెలిపారు.