వేదా న్యూస్, చొప్పదండి /రామడుగు:

నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు చిరాకు ఒత్తిడి నుండి బయట పడటానికి యోగా క్రీడలు ఆటా పాటల తో ఎంతో ఉపషమణం పొందవచ్చని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలల రివాయతు వెదిరలోని ఓ ప్రైవేట్ హాల్లో ఆదివారం ఆహ్వానితుల చప్పట్లు కేరింతల మధ్య అట్టహాసంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడానికి మన సంప్రదాయాల్లో దాగిన సాంస్కృతిక కలలు ఎంతో ఉపయోగ పడుతాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాటకు అనుగుణంగా వేసిన అడుగులు ఆహుతులను కట్టి పడేశాయి. అనంతరం ఐఐటి, ఎన్ఐటి, నీట్ లో మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులతో పాటు వారీ తల్లి తండ్రులను శాలువాలతో సత్కరించారు. అంతకు ముందు చదువుల తల్లి సరస్వతి చిత్ర పటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.