వేద న్యూస్, వరంగల్:

నగరం లో సాస్కి( స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ) పథకం అమలుకు సమగ్ర సమాచారంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.గురువారం కుడా కార్యాలయం లోని మినీ సమావేశమందిరంలో సాస్కి పథకం అమలులో భాగంగా కుడా ,బల్దియా లోని పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ శానిటేషన్ తో పాటు పలు విభాగాల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం లో కమిషనర్ పాల్గొని సమీక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సాస్కి పథకానికి సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా అవగాహన చేసుకొని అన్ని అంశాలను క్రోడీకరించి వారం లోగా పూర్తి సమాచారం అందజేయాలని రూపకల్పన లో భాగంగా నగరం లో గల పురాతత్వ విధానాలను ప్రోత్సహించి.. అభివృద్ధి చేయాలని, పాదచారులు నడిచే మార్గాలను అభివృద్ధి చేయడం మౌలిక వసతులను కల్పించడం ప్రజల రక్షణ చర్యలు చేపట్టడం సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పార్కుల అభివృద్ధి, ఓపెన్ స్పేస్ లను అభివృద్ధి చేయడం స్పాంజ్ సిటీ ఏర్పాటు ఇందుకోసం అనువైన స్థలాన్ని గుర్తించడం.. సిటీ గ్రీన్ కార్యక్రమం లో నగరం లో గ్రీనరీ ఏర్పాటు కు చర్యలు చేపట్టడం పురాతన బావుల పునరుద్ధరణ తదితర అంశాల పట్ల దృష్టి సారించాలన్నారు.

పైవన్నీ నమోదు చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమం లో ఎస్ ఈ సత్యనారాయణ, కుడా సిపిఓ అజిత్ రెడ్డి,సి ఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, సిహెచ్ఓ రమేష్, హెచ్ఓ లక్ష్మారెడ్డి,ఈ ఈ లు రవికుమార్,సంతోష్ బాబు ,డిఈ లు రవి కిరణ్, శివానంద్ స్మార్ట్ సిటీ పి ఎం సి ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు.