వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి:
మిర్యాలగూడ ప్రజలు ఎంతో మంచి మనుషులని,ఎంత ప్రేమిస్తారో అంతే విధంగా ద్వేషిస్తారని,ఇక్కడ ప్రజలు, అధికారులు,పాత్రికేయులు నాకు విధి నిర్వహణలో ఎంతో తోడ్పాటు అందించారని మిర్యాలగూడ మున్సిపలిటీ నుంచి హైదరాబాదుకు బదిలీ అవుతున్న సందర్భంగా కమిషనర్ యూసుఫ్ పత్రిక ముఖంగా తెలిపారు.వారు బదిలీ అవుతున్న సందర్భంగా జనయేత్రి ఫౌండేషన్ తరపు నుంచి మెమొంటో ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ఇక్కడ కమిషనర్ గా పనిచేసిన అనతి కాలంలోనే కమిషనర్ యూసుఫ్ మంచి పేరు తెచ్చుకున్నారని,మిర్యాలగూడ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచారని,ఆయనను సన్మానించడం మా ఫౌండేషన్ కు గర్వకారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో
జనయేత్రీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్,నల్గొండ జిల్లా గౌరవ అధ్యక్షులు అహ్మద్,కార్యనిర్వాహక అధ్యక్షులు కొమరోజ యాదగిరి,ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి,జాకీర్ హుస్సేన్,సోహెల్,రఫీ,అమీర్ అలీ,పోగుల సందీప్,కొత్తపల్లి సైదులు,షాహిర్ ప్రవీణ్,హుస్సేన్, శ్రీనివాస్,నాగయ్య తదితరులు పాల్గొన్నారు.