వేద న్యూస్, జమ్మికుంట:
న్యూస్ లైన్ చానల్ ఎడిటర్, జర్నలిస్ట్ శంకర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టి డబ్ల్యూ జె ఎఫ్ (TWJF) జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపురావు ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు.
ప్రజా సమస్యలను లెవనెత్తి ..ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే ఓ జర్నలిస్టుపై.. అర్ధరాత్రి 15 మందికిపైగా గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా దాడి చేయటం అమానుషం అన్నారు.

భౌతిక దాడులను టీ డబ్ల్యూ జె ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేసి …తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా స్వామ్యం లో నాలుగో పిల్లర్ గా ఉన్న జర్నలిస్టులపై దాడి సరి కాదని స్పష్టం చేశారు.