- అసిస్టెంట్ ప్రొఫెసర్ బల్గూరి మహేందర్ రావు
- ‘సుస్థిర జీవనానికి వాణిజ్య శాస్త్ర భావనలు’ అనే అంశంపై ప్రసంగం
వేద న్యూస్, జమ్మికుంట:
ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట, ఫ్యాకల్టీ ఫోరం సమావేశాలను ఫోరం కన్వీనర్ ఎడమ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వరుసగా నిర్వహిస్తున్నారు. సోమవారం మూడో సమావేశంలో భాగంగా కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్
బల్గూరి మహేందర్ రావు “సుస్థిర జీవనానికి వాణిజ్య శాస్త్ర భావనలు” అనే అంశంపై ప్రసంగించారు. మొదటగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశేఖర్ ప్రసంగిస్తూ నిత్యజీవితంలో కామర్స్ అక్షరాస్యత ప్రాముఖ్యత గురించి వివరించారు.
తెలుగు అధ్యాపకులు, రేన ఈశ్వరయ్య వక్తను సభకు పరిచయం చేశారు. సమావేశంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో పాటు విద్యార్థులు కూడా పాల్గొన్నారు. కంపెనీకి, పరిశ్రమకు భేదాలు, వాణిజ్య శాస్త్ర కారకాలు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, జీఎస్టీ, క్యాపిటల్ గెయిన్స్ పై ట్యాక్స్, ఇన్ కమ్ ట్యాక్స్, స్టాక్ మార్కెట్ కు సంబంధించిన ప్రాథమిక విషయాలపై సుమారు గంటన్నర సేపు సాగిన ప్రసంగంలో అధ్యాపకులు, విద్యార్థులు అనేక ప్రశ్నలను అడిగి చర్చలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సుజాత, స్వరూప రాణి, శ్రీలత, సువర్ణ, సుష్మ, మమత, రామ్మోహన్ రావు, శ్రీనివాస్ రెడ్డి, రవి ప్రకాష్, రమేష్, సాయి కుమార్, సుధాకర్, విద్యార్థులు పాల్గొన్నారు.