యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏనుగుల ప్రశాంత్ కుమార్
వేద న్యూస్, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏనుగుల ప్రశాంత్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీసీలకు 42 శాతం రాజకీయ, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించినందుకు బీసీలమంతా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ ప్రభుత్వం మాట నెరవేర్చుకున్నారన్నారు,బీసీల హృదయాల్లో చిరస్థాయిగా వారి స్థానం ఉంటుందన్నారు,రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలందరూ మాకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఘన విజయం అందించాలన్నారు,32 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించి బీసీల నడ్డి విరిచిన బీ.ఆర్.ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కాలన్నారు,బీజేపీ పార్టీ బీసీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూసి కేంద్రంలో గద్దెనెక్కి బీసీలపై కపట ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు,దమ్ముంటే దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లను అమలు చేసి చూపించాలని డిమాండ్ చేసారు.