వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసి రాందేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సెక్రెటేరియట్ లో మంత్రి సురేఖను ఆమె చాంబర్ లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నాయకులు రాందేవ్ సోమవారం కలిసి..పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు చెప్పారు.
అమ్మవారిపేట సమ్మక్క-సారలమ్మ జాతర గురించి, నిధుల గురించి చర్చించారు. జాతరకు సంబంధించిన నిధులు, ఏర్పాట్ల గురించి జాతర కమిటీతో చర్చించి చెప్తామని మంత్రి తెలిపినట్లు నాయకులు దాసి రాందేవ్ స్పష్టం చేశారు.