వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పవర్‌లోకి రాగా, తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్.. అప్పటి సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయిస్తుంటే.. ఏ రోజు ఎదురుచెప్పలేదని వీణవంక మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎండీ సాహెబ్ హుస్సేన్, నేతలు విమర్శించారు. నాడు కేసీఆర్‌కు ఏరోజు ఎదురుచెప్పని ఈటల రాజేందర్.. ఈరోజు రాష్ట్ర పరిస్థితి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్, మంత్రివర్గంపై మల్కాజిగిరి ఎంపీ ఈటల అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేటి ఆర్థిక దుస్థితికి కారకుడైన వ్యక్తి తొలి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అని ఆరోపించారు.  కార్యక్రమంలో నాయకులు ఎండీ సాహెబ్ హుస్సేన్, గంగాడి రాజిరెడ్డి, కర్ర తిరుపతి రెడ్డీ, చదువు జైపాల్ రెడ్డీ, ఈదునూరి పైడి కుమార్, మ్యాక వీరయ్య, మసాడి చొక్కా రావు, సమ్మిరెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

 

అప్రమత్తతే మేలు..  ఎండలతో తస్మాత్ జాగ్రత్త!: డాక్టర్ ఊడుగుల సురేశ్