వేద న్యూస్, మందమర్రి:

మండలంలోని అందుగుల పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త రామంచ రాములు అనారోగ్యంతో మరణించారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నేతలు అండగా నిలిచారు. గురువారం వారు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ చార్జి కడారి జీవన్ కుమార్ 5000 రూపాయలు, ఇతర నాయకులు కొండపర్తి సందీప్, కాల్వ కుమార్, ఎండీ నాసర్, అంకం రాజకుమార్ లు కలిసి మరో ఐదు వేల రూపాయలు అందించగా, ఈ మొత్తాన్ని గురువారం రాములు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు పార్టీ కార్యకర్తలను ఆదుకుంటుందని, రామంచ రాములు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.