•  వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ పెరుమాండ్ల రామకృష్ణ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ మీటింగ్ కు మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు మొదటగా ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు స్వీకరించడం చాలా సంతోషకరమని చెప్పారు.

ప్రతీ ఒక్కరు తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేన రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వర్ రావు, నాయకులు అశోక్ రెడ్డి, గొర్రె మహేందర్, భాస్కర్, కిరణ్, రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు హింగె శ్రీకాంత్, బక్కీ కతదితరులు పాల్గొన్నారు.