వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:
హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ నేతృత్వంలో హైదరాబాద్ కు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సమ్మేళన సభకు ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శ్రేణులు శుక్రవారం తరలి వెళ్లాయి.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో నేతలు కార్యకర్తలు హైదరాబాద్ కు తరలి వెళ్లారు.
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని, రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దేశం అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉందని నాయకులు అన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజలు హక్కులు కోల్పోతున్నారని, బీజేపీ చెర నుంచి విముక్తి కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.
అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యమాన్ని తీసుకొని గ్రామ గ్రామానా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ముందుకు పోతున్నాం అన్నారు. బీజేపీ రాజ్యంగా వ్యతిరేక నిర్ణయాలు మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.