• కబ్జారాయుళ్ల దౌర్జన్యం.!
  •  బాధితుడి ఇంటివద్ద కానిస్టేబుల్ అనుచరులు!
  • ‘‘కాపాడండి సార్..’’ అంటూ సుబేదారి పోలీసులకు బాధితుల వేడుకోలు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: 

తాజుద్దీన్ అనే కానిస్టేబుల్, అతని అనుచరులు కలిసి తమను ఇబ్బందులు పెడుతున్నాడు అని బాధితుడు మీడియాకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి రోడ్డులో ఉన్న తన ఇంటి విషయంలో కోర్టులో కేసు నడుస్తోంది. ఇవన్నీ తెలిసి కూడా అవతలి వ్యక్తితో కుమ్మకై, ‘ఓ పెద్ద సారు నాకు అండగా ఉన్నాడు’ అని తన పేరు మీద జూన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆగస్టు 21న ప్రైవేట్ వ్యక్తులను రాత్రి సమయంలో, తీసుకొని వెళ్ళి ఇంట్లో కిరాయికి ఉండే వారి సామాన్లు బయట పడేయడంతో.. బాదితుడు డయల్ 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు.

ఇట్టి విషయంలో సీఐ విచారణ చేయాలని ఎస్సై రామారావుకు చెప్పాడని, కానీ ఎస్సై పట్టించుకోవట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు కానిస్టేబుల్ కి సపోర్ట్ చేస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. శనివారం మళ్లీ  గ్యాంగ్ తో వచ్చి కిరాయిదారులను యువకులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

‘‘కిరికిరి ఉన్న ఇంటిని, కోర్టులో కేసు ఉన్న విషయం తెలిసి కూడా, ఎలా కొనుగోలు చేస్తారు.. లీగల్ గా కోర్టు ద్వారా రాకుండా రాత్రి పూట కొందరు కిరాయి మనుష్యులు పట్టుకొని వచ్చి మమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు..’’ అని పోలీసు స్టేషన్ ముందు ఉదయం నుండి బాధితులు పడిగాపులు కాస్తున్నారు. 

‘‘మంత్రి సీతక్క అనుచరులు.. అంటూ కొందరు, నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడు రాహుల్ రెడ్డి మనుషులం..’’ అంటూ మరికొందరు బెదిరిస్తున్నట్లు బాధితుల చెప్తున్నారు.

ఒక కానిస్టేబుల్ హోదాలో ఉండి, అన్ని తెలిసి కూడా,కోర్టులో కేసు ఉన్న ప్రాపర్టీ కొనుగోలు చేయడం ఎందుకు? మీకు ఉన్న డాక్యుమెంట్లతో లీగల్ గా కోర్టు ద్వారా వెకెంట్ ఆర్డర్ కాపీ తెచ్చి ఖాళీ చేయించొచ్చు కదా? కోర్టు ద్వారా రాకుండా ఇల్లీగల్ గా బలవంతంగా, రాత్రి పూట రావడం ఏంటి? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులను బాధితులు రిక్వెస్టు చేస్తున్నారు.