వేద న్యూస్,శాయంపేట:
కులం కట్టుబాట్లు పాటించకుంటే కులం నుంచి బహిష్కరిస్తామన్న కులస్తులకు, గ్రామస్తులకు మంగళవారం శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్సై జక్కుల పరమేష్ మాట్లాడుతూ కాలం మారుతున్నందున ఇలాంటి పోకడలు ఉండవద్దని, కాలానికి అనుగుణంగా వ్యవహరించాలని, ఎదుటివారి హక్కులు హరించవద్దని, ఇలాంటి చర్యలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.