వేద న్యూస్, నల్లబెల్లి:
నల్లబెల్లి పోలీస్ స్టేషను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు పోలీస్ సంబంధించిన పోలీస్ స్టేషన్ రికార్డులను సీపీ పరిశీలించారు. స్టేషన్ సిబ్బంది వివరాలతో పాటు, పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలకు సంబంధించి కేసులు నమోదు, గోడవలపై ఆరా తీశారు.
రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఉంచాలని, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యారుదలపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని స్టేషన్ అధికారికి సూచించారు. పోలీస్ కమిషనర్ వెంట డి.ఎస్.పి అంకిత్ కుమార్ ఏ సి పి రవీందర్ రెడ్డి దుగ్గండి రూరల్ సీఐ సాయి రమణ , ఎస్సై వి గోవర్ధన్. విజయ్ వేణు వినయ్ రేవంత్ బాలు శ్రావణ్ ప్రభాకర్ సిబ్బంది పాల్గొన్నారు.