వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను వరంగల్పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో గృహనిర్బంధంలో ఉన్న ప్రజల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడుప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే స్పందించాలని కోరారు.