వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి:

 

సాలూరు పట్టణం వేదసమాజం వీధిలో నివాసముంటున్న పట్టణ మాజీ కౌన్సిలర్, సీపీఐ నాయకులు కామ్రేడ్ సిద్దాబత్తుల రామచంద్రరావు(77) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు,  మాజీ గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు పీడిక రాజన్నదొర కామ్రేడ్ రామచంద్రరావు భౌతికాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కామ్రేడ్ సిద్దాబత్తుల రామచంద్రరావు ఎంతో ప్రజాసేవ చేశారని గిరిజనుల కోసం ఎన్నో పోరాటాలు చేసారని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.  ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పట్టణ వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.