- ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కారిడార్ ఏర్పాటు చేయాలి
- చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి: సీ పీ ఎం
వేద న్యూస్,బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో గ్రామస్తులను కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మిడ్ మానేరు ప్రాజెక్టు వల్ల ఇక్కడున్న దాదాపు మెజార్టీ గ్రామాలు భూములతో పాటు తమ సర్వస్వాన్ని కోల్పోయి పూర్తిగా ఉపాధి లేకుండా మిగిలిపోయారు.
గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఆచరణలో కనబడలేదు. కాంగ్రెస్ పార్టీ మేం ప్రభుత్వంలోకి వస్తే ముంపు గ్రామాల ప్రజలకు కారిడార్ ఏర్పాటు చేసి ఇక్కడున్న వారికి ఉపాధి, అలాగే చదువుకున్న యువతీ, యువకులకు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావడానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటి కూడా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ముప్పు గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో పని దొరకకపోవడం వల్ల తీవ్రంగా ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకొని,కారిడార్ ఏర్పాటు చేసి సాధ్యమైనంత త్వరలో వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఎం నాయకులు కోరారు. లేనియెడల భవిష్యత్తులో ముంపు గ్రామాల ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించే పరిస్థితి ఉంటదనీ, కాబట్టి కారిడార్ ఏర్పాటు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచ అశోక్,వరద వల్లి, గ్రామస్తులు,వనపర్తి లచ్చయ్య, వల్లంపట్ల బాలయ్య, అంబటి చంద్రయ్య, మందాల రవి, గోట్ల ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.