• ‘వాహ్.. వాట్ ఏ ఐడియా’’ అంటున్న గ్రామస్తులు 

వేద న్యూస్, వరంగల్:

క్రియేటివిటీలో తాము సైతం ముందుంటామని ఓ రైతు నిరూపించారు. టెక్నాలజీ యూసేజ్‌లో, యంత్రాల వినియోగంలో ‘మేము సైతం’ అనే విధంగా జనం ముందుకెళ్తున్నారు.

ఈ తరుణంలో జిల్లాకు చెందిన రైతు వాణిజ్య పంట అయిన పొగాకును దండలుగా చేసిన అనంతరం తరలింపునకు హనుమకొండ జిల్లా ఎల్క తుర్తి మండలం చింతలపల్లి గ్రామ రైతు కుడుతాడి చిరంజీవి బైక్  యూజ్ చేశాడు. 

oplus_0

పొగాకును దండాలుగా అల్లిన తర్వాత ఓ చిన్నపాటి ట్రాలీ మాదిరిగా ఉండే టైర్ల బండిపైన వాటిని చేర్చి.. దానిని బైక్‌కు తాడు సాయంతో కట్టి .. షెడ్ వద్దకు తరలిస్తున్నాడు. అది చూసి గ్రామస్తులు వాహ్.. అంటున్నారు. రైతు సైతం క్రియేటివ్‌గా ఆలోచిస్తూ.. శ్రమను యంత్రాల సాయంతో తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొంటున్నారు.