- సైబర్ క్రైమ్ పైన అవగాహన తప్పనిసరి
- 1930 నంబర్ సంజీవిని లాంటిది
- నల్లబెల్లి ఎస్ఐ గోవర్ధన్
- వినాయక మండపాల్లో సైబర్ క్రైమ్స్‌పై అవగాహనకు బ్యానర్లు
వేద న్యూస్, నల్లబెల్లి:
నల్లబెల్లి మండలంలో సైబర్ మోసాలను అరికట్టేందుకు స్థానిక పోలీసు విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఎస్సై గోవర్ధన్ గణపతి మండపాల వద్ద ప్రజలకు అవగాహన కల్పిస్తూ బ్యానర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్ మోసగాళ్లు ఏపీకే ఫైల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని, మొబైల్ ఫోన్లలో వచ్చే అనుమానాస్పద మెసేజ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. చిన్నపిల్లలు నుండి పెద్దల వరకు అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సైబర్ నేరగాళ్ల వలలో పడితే ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా, వ్యక్తిగత డేటా కూడా ప్రమాదంలో పడుతుందని ఆయన స్పష్టంచేశారు. ఈ మోసాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కలగాలని, గణపతి మండపాల వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్ల ద్వారా చైతన్యం కల్పించడం లక్ష్యమని తెలిపారు.
ప్రజలు జాగ్రత్తలు పాటిస్తేనే సైబర్ మోసాలను అరికట్టగలమని, అనుమానాస్పద లింకులు, ఫైల్స్, ఫోన్ కాల్స్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్సై గోవర్ధన్ పిలుపునిచ్చారు.