– ఏసీపీ సతీష్ బాబు
వేద న్యూస్, శాయంపేట:
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పరకాల ఏసిపి సి.సతీష్ బాబు అన్నారు. సోమవారం మండలంలోని ఏంజెపి బాలుర పాఠశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపి సతీష్ బాబు మాట్లాడుతూ ఇటీవల జరుగుతున్న సైబర్ నేరలను దృష్టిలో ఉంచుకొని వరంగల్ కమీషనరేట్ ఎలాగైనా ఇట్టి నేరలను ఆపాలనే ఉద్దేశ్యం తో తీసుకున్న ఆలోచన ప్రకారం తీసుకువచ్చిన సైబర్ సారధి 1930, ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అనే ప్రోగ్రామ్ తో ప్రజలకు అవగాహనా కల్పించాలని శాయంపేట మండలం లోని ఎంజెపి బాలుర పాఠశాల లో అవగాహనా సదస్సు నిర్వహించారు. పిల్లలకు సైబర్ క్రైమ్ ,హెల్ప్ లైన్,, గోల్డెన్ అవర్ ,రిపోర్టింగ్, ఫ్రాడ్ లింక్స్ , ఓటీపీ షేరింగ్ ,గురించి తెలిపి ఇట్టి వాటిపై జాగ్రత్తగా ఉండాలని పిల్లలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ గోపి, సిసిఎస్ ,శాయంపేట సీఐ పి.రంజిత్ రావ్, ఎస్సై జక్కుల పరమేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.