•  హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ అంటూ టోకరా
  • సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వివరాలు వెల్లడి

వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల:

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో కలిపి ఎన్‌సి‌ఆర్‌పి పోర్టల్‌లో నమోదైన 79 పిటీషన్లలో సుమారుగా రూ. 60 లక్షల వరకు మోసాలు చేసిన నిందుతుడిని హైదరాబాద్ లో జిల్లా సైబర్ టీమ్ పట్టుకున్నదని సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో బుధవారం వెల్లడించారు. 

 

కడప జిల్లా భాగ్యనగర్ కాలనీ జమ్మలమడుగుకు చెందిన  32 ఏండ్లున్న ముల్లుంటి సలీం మాలిక్ బాధితులకు ఫోన్ చేసి..  ‘ఆరోగ్య శాఖ నుండి మాట్లాడుతున్నాం’ నమ్మబలుకుతాడు.
హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ చేస్తామని చెప్పి.. బాధితులకు మొబైల్ నుండి కాల్ చేసి వారిని ఒక లింక్ పంపించి.. ఆ లింకు ఓపెన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే.. మీకు మీ ఆరోగ్యశ్రీలో ఖర్చయిన డబ్బులు తిరిగి మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయని చెప్తారు.  బాధితులు నమ్మి ఆలింక్ క్లిక్ చేసి లింక్ లో యూపీ ఐ పిన్ ఎంటర్ చేయడం ద్వారా డబ్బులు కోల్పోయారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముస్తాబాద్ మండలంలో రాజిరెడ్డి అనే బాధితునికి, వేములవాడ టౌన్ పరిధిలో ఒక బాధితుడికి నేరస్థుడు సలీం మాలిక్ కాల్ చేసి ఆరోగ్య శ్రీ డబ్బులు రిఫండ్ చేస్తానని చెప్పగా, వారు నమ్మి యూపీ ఐ పిన్ ఎంటర్ చేయడం ద్వారా ఒకరు ముస్తాబాద్ కి చెందిన రాజిరెడ్డి రూ.46 వేలు, మరొకరు రూ. 10000 నష్టపోయారు. రాజిరెడ్డి ఈ మేరకు ముస్తాబద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ ఆదేశాల సిరిసిల్ల రూరల్ మొగిలి, ముస్తాబద్ ఎస్.ఐ గణేష్,జిల్లా సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్, సిబ్బంది కిట్టు, గంగారెడ్డి,ముస్తాబాద్ కానిస్టేబుల్ కాసిం టీమ్ గా ఏర్పడి సాంకేతికత ఆధారంగా బుధవారం హైదరాబాద్ నిందుతుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.