- నియామక పత్రం శ్రీనివాస్ కు అందజేసిన ఆ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట:
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) వరంగల్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న డ్యాగల శ్రీనివాస్ ను నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ పి.సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జిగా నియమించారు.
ఈ మేరకు ఆ కౌన్సిల్ రాష్ట్ర కార్యాలయంలో..కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అయిలినేని శ్రీనివాసరావు..డ్యాగల శ్రీనివాస్ కు వరంగల్ జిల్లా అధ్యక్షునితో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ చార్జిగా బాధ్యతలు ఇస్తున్నట్లు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవితో పాటు తనపై నమ్మకంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జి గా నియమించినందుకు..జాతీయ అధ్యక్షులు డాక్టర్ సంపత్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు అయిలినేని శ్రీనివాసరావుతో పాటు రాష్ట్ర కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలిపెళ్లి గంగాప్రసాద్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు నక్క గంగారాం, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు విశ్వనాథుల రమేష్, యూత్ వింగ్ కన్వీనర్ పైడిమర్రి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.