- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర కుమార్
వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్:
రెండో విడత ‘దళిత బంధు’ రాలేదని దళిత కుటుంబాలు ఆందోళన చెందొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర కుమార్ అన్నారు. హుజురాబాద్ లో మంగళవారం ఆయన మాట్లాడుతూ ‘దళిత బంధు’ రెండో విడత విషయమై కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ చార్జి వొడితల ప్రణవ్ బాబు గతంలో పత్రిక ముఖంగా దళితులు ఆందోళన చెందవద్దని తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రణవ్ బాబు నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఒప్పించి దళితులకు ‘దళిత బంధు’ను ఇప్పిస్తామని వెల్లడించారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మనసులో ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.
దళితులందరికీ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు కొక్కుల శ్రీధర్, అయిలి సతీష్, మహమ్మద్ రియాజ్, వీణవంక రాజయ్య, పోతారం అశోక్, శ్రీరాముల రమేష్, గోపరాజు రమేష్, ఇల్లందుల నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.