- డీసీపీఓ బూర్ల మహేష్
వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి:
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని డీసీపీఓ బూర్ల మహేష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు సూర్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
బాల్యం ఎంతో అమూల్యమైనదని బాల్య వివాహం వలన బాలికల చదువు, ఆరోగ్యం పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
బాలికల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేస్తుందని బాలికల విద్యను ప్రోత్సహించడానికి కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చిందని గుర్తు చేశారు.
2030 నాటికి బాల్య వివాహాలు లేని దేశంగా నిర్మించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డిఎంసి శారద, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేష్, ఉపాధ్యాయుడు శ్రీ వర్ధన్, సూర్ సంస్థ కోఆర్డినేటర్ సంతోష్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్, దేవాజీ, జెండర్ స్పెషలిస్ట్ రాణి, సాగర్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.