• కుక్కలకు ఆహారంగా మారిన మృతదేహం
  •  ప్రభుత్వ హాస్పిటల్ లో మృతదేహాన్ని భద్రపరచలేని దుస్థితి…

వేద న్యూస్, జడ్చర్ల :

బతికున్నప్పుడు ఎలా ఉన్నా..చనిపోయిన వ్యక్తిని గౌరవిస్తుంటాం.మృతదేహానికి అంత్యక్రియలు కూడా గౌరవప్రదంగా జరుపుతూ ఉంటాం.ప్రభుత్వ హాస్పిటల్ లో డెడ్ బాడీ లను పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించాల్సిన బాధ్యత వుంటుంది.

 

 

కానీ జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరచాల్సిన మృతదేహాలకు దిక్కు లేకుండా పోయింది.జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందారు.ఇవాళ మృతదేహం లభ్యం కావడంతో పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారు.

మృతదేహాన్ని భద్రపరచాల్సిన సిబ్బంది …కనీసం స్ట్రెచర్ మీద కూడా పెట్టకుండా మార్చురీలో పడేయడంతో కుక్కలు పీక్కుతీన్నాయి.ఈ దారుణ ఉదంతం ప్రభుత్వ హాస్పిటల్ లో దయనీయ పరిస్థితి కి అద్దం పడుతుంది.

మృతదేహాలను భద్రపరచడానికి ఫ్రీజర్ లు కూడా లేకపోవడం, ఉన్నా పని చేయకోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది.

 ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్వహణలో ఘోరంగా విఫలమైందనడానికి ఈ ఘటన నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *