వేద న్యూస్, సినిమా:

తారస్థాయి సినీ నటులు రాజకీయ రణ రంగంలోకి వచ్చారు. తెరమీది పాత్రలే కాకుండా తెరనుంచి బయటకు వచ్చి ప్రత్యక్షప్రా త్రలు పోషించారు. దక్షిణ భారతంలో ప్రధానంగా సినిమాలు, రాజకీయాలు అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. బృందావనంలాంటి సినిమాలను వదిలి దండకారణ్యం లాంటి రాజకీయరణం లోకి దూకారు. సినిమా ‘రాజకీయం’ ద్వారా విజయం పొందినవారున్నారు. అనుకున్నంత ఆదరణ పొందలేక రాజకీ యాల నుంచి తప్పుకున్న వారూ ఉన్నారు.

దక్షిణ భారతంలో కొంతమేరకు రాజకీయాల్లో సినీతారలు ఎక్కువ విజయాలు సాధించారు. ఉత్తర భారత నటులు కూడా విజయాలు పొందారు. కానీ ఆశించినంత కాదు. అపజయాలు గమనిస్తే అమితాబచ్చన్, చిరంజీవి, విజయకాంత్, ఆర్. శరత్ కుమార్, శివాజీ గణేషన్ మొదలైనవారున్నారు.

అమితాబచ్చన్ 1984లో కాంగ్రెస్ పార్టీ నుంచి నాటి ముఖ్యమంత్రి డి.ఎన్. బహుగుణ మీద పోటీచేశారు. 3 లక్షల ఓట్ల మెజారిటీతో లోక్సభకు ఎన్నికయ్యారు. కానీ తదనంతర కాలంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఇమడలేక తప్పుకున్నారు. తన ఏబీసే కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న ఎస్పీకి మద్దతిచ్చారు. అందుకు బహుమానంగా ఎస్పీ జయాబచ్చన్ ను రాజ్యన భకు  పంపింది.

 

2009లో చిరంజీవి ప్రజారాజ్యం పేరిట పార్టీ పెట్టారు. ‘మార్పు’ అనే నినాదమిచ్చారు. కానీ ఎన్నికల తరువాత తన విధానాలు మార్చుకున్నారు. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. 81లక్షల ఓట్లు, 18 శాసనసభస్థానాలు ఇచ్చిన ప్రజాతీర్పును వమ్ము చేశాడు. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుని కేంద్ర సహాయమంత్రి పదవి పొందారు.

విజయకాంత్ కెప్టెన్ ప్రభాకరన్, రమణ వంటివారు సామాజిక చిత్రాలతో ప్రజల ఆదరాభిమా నాలు పొందారు. ప్రజల అభివృద్ధి పేరుతో డీఎండీకే పార్టీని స్థాపించారు. కాని ఆశించిన ఫలితాలు, స్థానాలు గెలువలేదు. ప్రతిపక్షపాత్ర పోషించా రు. ఆర్.శరత్ కుమార్ ఏఐఏఎస్ఎంకే పార్టీ స్థాపించి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కానీ తదనంతర కాలంలో మళ్లీ తెరమీద (సినిమా)కే పరి మితమయ్యారు. కమల్ హాసన్ పార్టీ స్థాపించిన అంతగా ప్రభావం చూపలేకపోయారు. రాజ్యసభ సభ్యుడిగా డీఎంకే తరఫున నామినేట్ అయినట్టు తెలుస్తోంది.

శివాజీ గణేషన్ 1987లో టీఎం.ఎం పేరుతో పార్టీని స్థా పించాడు. కానీ పార్టీని విజయతీరాల వైపునకు నడిపించలేకపోయారు. ఎం.జి.రామచంద్రన్, ఎన్టీఆర్ ముఖ్యులు శత్రుప్నుసిన్హా కూడా కొంతమేరకు విజయుడే.

ఇళయ దళపతి విజయ్.. సొంత పార్టీ స్థాపించి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన శక్తిని పరీక్షించుకోబోతున్నారని చెప్పొచ్చు. 

 

ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఆ మాటకొస్తే .. ప్రపంచవ్యాప్తంగానూ, తెలుగు నాట.. అత్యంత ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన పదేండ్లకు విజయం సాధించారు. జనసేన నాయకుడిగా, ఏపీ ఉపముఖ్యమంత్రిగా విభజిత ఏపీతో పాటు కేంద్ర రాజకీయాల్లో ఎన్డీఏ కీలక భాగస్వామికి, మోడీకి అత్యంత సన్నిహితుడిగా పవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఈ తారస్థాయి నటులు రాజకీయాల్లోకి వస్తే వారు అశించేది ఏమిటీ? ఏ పదవి? వారికి ముఖ్యమంత్రే ముఖ్యం. ఎందుకంటే వారున్న రంగంలో ఉన్నతులు (ప్రతిష్ట కలిగిన వాడు). రాజకీయాల్లో కూడా అంతే గుర్తింపు కోరుకున్నారు. ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. కానీ ఎమ్మెల్యే పదవితో సర్దుకోలేరు. కానీ వారు తీసుకునే నిర్ణయాలు, విధానాలు వారిని నిలబెడతాయి. పడగొడతాయి.

ఎన్టీ. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయానికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉన్నది? కీలుబొమ్మల ముఖ్యమంత్రుల ప్రభుత్వం నడుస్తున్నది. దాని పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నది. దానిని గమనించిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాడు. పార్టీ స్థాపించిన తొమ్మిదినెలల్లో అధికారంలోకి వచ్చాడు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు. జనంలోకి వెళ్లొచ్చు. వారి తీర్చును బట్టి చట్టసభల్లోకి వెళ్లొచ్చు. కాని ముఖ్యంగా సినీ తారలు రావడానికి కారణం ఏమిటీ? ప్రజల్లో వారికున్న ఆదరణ, ఆకర్షణ వారు తమ కష్టసుఖాలు తెలుసుకుంటారనే భావన ప్రజల్లో ఉండొచ్చు. అంతేగాకుండా రాజకీయంగా ఉన్న అస్థిరత్వం కూడా దోహదపడుతుంది. ఈ తార రాజకీయాలు నిర్ణయించేది ఎవరు? తారలనే కాదు. ఏ రాజకీయ నాయకుల భవితవ్యమైనా నిర్ణయించేది ప్రజలు వారి ముందున్న సవాళ్లను ఎలా పరిష్కరిస్తారో, విధానాలు, ఆశయాలు నిర్దిష్టంగా, నిర్దుష్టంగా ప్రజల ముందు బహిరంగపరచాలి. వారు ప్రజలు) మాత్రమే తీర్పు చెప్పగలరు.