వేద న్యూస్, చార్మినార్:
ప్రభుత్వ సిటీ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం, కమిషన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ, ఢిల్లీ సంయుక్తంగా రెండ్రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నదని సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య బాల భాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు(బుధవారం), రేపు(గురువారం) రెండ్రోజులు ‘‘రాజ్యాంగంలో సాంకేతిక పదాల ప్రాముఖ్యత’’ పై నిర్వహించే సదస్సును ఈ నెల 3న ఉదయం 10.30 గంటలకు ఆజామ్ హాల్ లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ సభకు ముఖ్య అతిథిగా విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, గౌరవ అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య రవీందర్, కమిషన్ ఉపసంచాలకులు డా.షహజాద్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారని వెల్లడించారు.

భాస్కర్ సమన్వయం చేస్తున్న ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుండి వంద మందికి పైగా ఆచార్యులు పాల్గొననున్నారు. పది మంది విషయ నిపుణులు సాంకేతిక సదస్సులలో అనేక అంశాలపై ప్రసంగించునున్నారు. అనంతరం ఆయా అంశాలపై చర్చ జరగనుంది.