• ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాజు విస్తృత ప్రచారం 

వేద న్యూస్, హన్మకొండ:
బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు సొనబోయిన రాజు అన్నారు. దామెర మండలకేంద్రంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి డా.సుధీర్ కుమార్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ బూటకపు హామీలతో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిందని అన్నారు. పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం లో తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పారు. డా. సుధీర్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు యదండ్ల ఐలయ్య, దామెర కృష్ణ, జల్సా రాజు, వంగ రవి, సోనబోయిన తిరుపతి తదితరులు పాల్గొన్నారు.