వేద న్యూస్, నాగర్‌కర్నూల్:

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమిస్తుండగా, అటవీ శాఖ సిబ్బంది అడ్డుకోగా వారిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా, బుధవారం అక్కడికి డీఎఫ్‌వో వెళ్లారు.

ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసి ఆక్రమించిన అటవీ భూములలోకి నాగర్‌కర్నూల్ డీఎఫ్‌ఓ రోహిత్ గోపిడి 100 మంది సిబ్బందితో అక్కడికి చేరుకొని.. 50 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనపరచుకున్నారు. ఆ ల్యాండ్‌లో మొక్కలు నాటి సీపీటీలు త్రవ్వించారు.

. గతంలో ఆక్రమణ జరిగిన ఫారెస్ట్ భూమిని కూడా తిరిగి స్వాధీనపరచుకున్నారు. డీఎఫ్‌వో ఇంకా 300 ఎకరాల అటవీ శాఖ భూమిని రికవరీ చేయుటకు ప్రణాళిక వేసినట్టు తెలుస్తోంది.

ఒక వారం పాటు ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారని సమాచారం. ఇక ల్యాండ్‌లో మొక్కల కోసం ప్రత్యేకంగా ఒక నీటి ట్యాంకర్ ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక సిబ్బందిని రాత్రి, పగలు ఉండేలా ఏర్పాటు చేశారు.