- సత్తా చాటిన దామెర ఉన్నత పాఠశాల విద్యార్థిని జి. వైష్ణవి
వేద న్యూస్, వరంగల్:
జవహార్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ 17 కబడ్డీ బాలికల విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామెర కు చెందిన విద్యార్థిని జి. వైష్ణవి జిల్లా జట్టుకు ఎంపికైనట్లు మండల విద్యాశాఖ అధికారి లకావత్ రాజేష్ కుమార్ తెలిపారు.
నవంబర్ 3,4 & 5 తేదీల్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు వైష్ణవి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా దామెర మండల విద్యాశాఖ అధికారి & పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. రాజేష్ కుమార్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వైష్ణవి నీ , అందుకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందం, ఫిజికల్ డైరెక్టర్ దేవేందర్ లను అభినందించారు.
కృషి, పట్టుదల, ఏకాగ్రతతో క్రీడల్లో పాల్గొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని , నిత్యం ప్రాక్టీస్ అనేది తప్పనిసరిగా చేయాలని అప్పుడు మాత్రమే క్రీడా ఫలాలు అందుకోగలమని వారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ దేవేందర్ ఉపాధ్యాయులు నవీన్, శ్రీలత, రుక్మిణీదేవి, రమేష్ రెడ్డి, ఉమామహేశ్వర్, సుజన, శుదక్షణ దేవి, మాధవి,వెంకట్ రెడ్డి,రవీందర్ పాల్గొన్నారు.