వేద న్యూస్, సినిమా:

స్టైలిష్ హీరో.. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే.. ఏ పరిశ్రమకు చెందిన నటులు అయినా  సరే.. దర్శకుడు కథ చెప్పకుండా.. కేవలం రజనీకాంత్ మూవీ అని చెప్తే చాలు.. సినిమా చేసేస్తారు. కానీ, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున మాత్రం .. రజనీకాంత్ చిత్రం అయినా .. సదరు సినిమా స్టోరీ తనకు చెప్పాలని డైరెక్టర్‌ను అడిగారు. దాంతో ఆ దర్శకుడు… టాలీవుడ్ కింగ్‌ను ఒప్పించడానికి ఏకంగా 6 నుంచి 7 సార్లు చిత్రానికి సంబంధించిన కథను చెప్పారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో మీకు తెలుసా.. 

సూపర్ స్టార్ రజనీకాంత్, ‘ఖైదీ’ ఫేమ్ లోకేశ్ కనక్ రాజ్ కాంబోలో వస్తున్న ‘కూలీ’ చిత్రం.. ఈ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ‘ఆమీర్ ఖాన్’, కన్నడ నటుడు, దర్శకుడు (కోలీవుడ్) స్టార్ ఉపేంద్రతో పాటు నటులు  నటిస్తున్నారు. ఈ చిత్రంలో కేమియో కోసం అడిగిన వెంటనే ఆమీర్ ఖాన్, ఉపేంద్ర ఒప్పుకోగా, నాగార్జున మాత్రం కథ అడగగా, ఆయనకు 6 నుంచి 7 సార్లు స్టోరీ చెప్పినట్టు లోకేశ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

దీంతో ‘కూలీ’ చిత్రంలో నాగార్జున పాత్ర వెరీ స్టైలిష్ ప్లస్ కీలకంగా ఉండబోతున్నదని స్పష్టమౌతున్నదని అక్కినేని అభిమానులు అంటున్నారు. కాగా, నాగార్జున, ధనుష్, రష్మిక మందన కలిసి నటించిన ‘కుబేర’ చిత్రం ఈ నెల 20 న విడుదల కాబోతున్నది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. 

 

 

 

 

 

 

 

 

 

 

 

https://x.com/SravanPk4/status/1933056886389047521