- రానున్న రోజుల్లో మరిన్ని సేవ కార్యక్రమాలు: సొసైటీ సభ్యులు
వేద న్యూస్, ఆసిఫాబాద్:
విద్యార్థులకు సరైన వసతులు కల్పించినప్పుడే వారు ఏకాగ్రతతో చదివి చదువులో రాణిస్తారని వల్డ్ ఆఫ్ విస్డం సోషియో వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పేర్కోన్నారు. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరరించుకొని ఆసిఫాబాద్ మండలంలోనీ మోతుగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సొసైటీ ఆధ్వర్యంలో రాగి జావ తాగడానికి స్టీల్ గ్లాసులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజులలో సొసైటీ ఆధ్వర్యంలో మరిన్ని సేవ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. సామాన్య ప్రజలకు సేవ చేయడమే వల్డ్ ఆఫ్ విస్డం సోషియో వెల్ఫేర్ సొసైటీ ఉద్దేశ్యమని వారు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ సర్పంచ్ ఇర్ధండి సువర్ణ వినోద్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్లాసులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.