వేద న్యూస్, ఇల్లందకుంట:
కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఇంగిలే రామారావు అధ్వర్యంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం మండల పరిధిలోని శ్రీరాములపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ..చేతి గుర్తుకు ఓటు వేయాల్సిందిగా గ్రామస్తులను కోరారు.

ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి చేతి గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమవుతుందని చెప్పారు. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీం అని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలనలో దేశాన్ని అభివృద్ధి చేస్తే..10 ఏళ్లలో బీజేపీ దేశాన్ని నాశనం చేసిందని తీవ్రంగా మండిపడ్డారు. మే 13 న జరిగే ఎలక్షన్లలో హస్తం గుర్తుకు ఓటేసి వెలిచాలను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవికుమార్ లక్ష్మయ్య, రాకేష్, రాజు, కల్యాణ్, నాగరాజు., నాగయ్య, శ్రీనివాస్, జానీ యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.