వేద న్యూస్, మాడ్గులపల్లి: 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో పయనించాలని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిమ్మల నవీన్ రెడ్డి అన్నారు. మాడ్గుల పల్లి మండలంలోని ఇస్కబావి గూడెంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న భారత రాజ్యాంగనిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహా ఏర్పాటు పనులకు ఆదివారం అయన స్థానిక నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల ప్రజలకు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో ప్రత్యేక రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని నాడు అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరచడం వల్లనే నేడు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలతోపాటు మైనార్టీ వర్గాల ప్రజలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకుని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందడుగు వేస్తున్నారన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమం లోమాజీ పిఎసిఎస్ చైర్మన్ జేరిపోతుల రాములు గౌడ్, మాజీ ఎంపీపీ కోఆప్షన్ సభ్యుడు షేక్ మౌలాలి,అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సామ వెంకన్న, వల్లపుదాసు చంద్రశేఖర్, పోతురాజు సురేష్, మేడి మలాకి,గోలి ఆరోను-ప్రభాకర్, మేడి సుందర్, పోతురాజు శ్రీనివాసు,పోతురాజు ప్రభాకర్,మేడి రవి గోలీ సిద్దు, గోలిమదన్, వెలిజాల యాదగిరి,మేడి మోష, పోతురాజు నాగేశ్, ఎలిజాల అఖీల్, పోతురాజు సురేశ్, వల్లపుదాసు రాము, వల్లపు దాసు అశోక్,మంచికంటి శ్రీనివాస్ రెడ్డి, మంచికంటి నాగిరెడ్డి, గుర్రం శ్రీనివాస్ రెడ్ది, పోతురాజు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *