వేద న్యూస్, వేములపల్లి :
ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని వేములపల్లి ఎస్సై డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి విధితమే. ఆదివారం రావులపెంట పాలేరు వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రావులపెంట గ్రామానికి చెందిన భయ్యా అనిల్, శీలం సైదులు అక్రమంగా ఇసుక తరలిస్తుంటే పట్టుబడినట్లు తెలిపారు. ఆ ఇద్దరిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. మండలంలో ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే ఎంతటివారికైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.